YSRCP Leaders : రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్ తప్పదా..?

YSRCP Leaders : రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్ తప్పదా..?
X

వైసీపీ నేతల అవినీతి పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇన్ని రోజులు తాము సత్యహరిశ్చంద్రులం అని బిల్డప్ కొట్టిన వారంతా.. అవినీతి కేసుల్లో వరుసగా ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే కల్తీ లిక్కర్, లడ్డూ కల్తీ, లిక్కర్ లాంటి కుంభకోణాల్లో అరెస్ట్ లు జరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆదుదాం ఆంధ్రాలో చేసిన అవినీతి ఇప్పుడు బయట పడింది. ఈ అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ కమిటీ పూర్తి నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో రూ.40 కోట్ల అవినీతి జరిగిందని.. అప్పటి క్రీడాశాఖ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలిసి ఈ అవినీతికి పాల్పడ్డట్టు నివేదికలో పొందుపరిచారని సమాచారం.

వీరిద్దరిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది విజిలెన్స్ కమిటీ. రూ.40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన 'ఆడుదాం.. ఆంధ్రా' పూర్తయ్యేసరికి రూ.100 కోట్లుపైనే ఖర్చు చూపించారు. కానీ ఈ నిధులను పూర్తిగా క్రీడల కోసం కాకుండా పక్క దారి పట్టించినట్టు రిపోర్టులో తేలింది. గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటాయిస్తే.. తమ సొంత నిధులు మరో రూ.10వేలు ఖర్చయ్యాయంటూ మొత్తం రూ.20 వేలు ఖర్చు చూపించారు అప్పటి నాయకత్వం.

ఇలా ప్రతిస్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింత లు ఖర్చు చేసినట్లు చూపించి దాదాపు రూ.40 కోట్ల దాకా పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పక్కదారి పట్టించడంపై సాక్ష్యాలు కూడా బలంగా ఉండటంతో మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్ తప్పదేమో అంటూ వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వీరిద్దరూ ఎన్నో నీతులు చెప్పేవారు. ఇప్పుడు ఈ అవినీతిపై మాత్రం పెద్దగా స్పందించట్లేదు.

Tags

Next Story