బ్రిటిష్‌ నియంత పాలన 2.0లా జగన్‌రెడ్డి పాలన ఉంది: అచ్చెన్నాయుడు

బ్రిటిష్‌ నియంత పాలన 2.0లా జగన్‌రెడ్డి పాలన ఉంది: అచ్చెన్నాయుడు
Achennaidu: వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Achennaidu: వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్‌ రెడ్డి పాలన.... బ్రిటిష్‌ నియంత పాలన 2.0లా ఉందన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావడంతో వైసీపీ నేతలు కడుపుమంటతో బాధపడుతున్నారన్నారు. రైతుల మహాసభకు హైకోర్టు అనుమతి ఇచ్చినా.. ప్రజలు సభకు వెళ్లకుండా వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని నిప్పులు చెరిగారు.

ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ మూడేళ్ల పాలనలో పోలవరంలో ఏ పనులు చేశారో.. నిర్వాసితులకు ఏం న్యాయం చేశారో.. సీఎం చెప్పగలరా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఆంక్షలతో అడ్డుకోవడం ఏంటని... ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు హామీలిచ్చి... అధికారంలోకి వచ్చాక మోసం చేస్తారా అని జగన్‌ సర్కార్‌ను ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.

Tags

Read MoreRead Less
Next Story