ఏపీలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి పరిపాలన అనుమతులు

ఏపీలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి పరిపాలన అనుమతులు
ఏపీలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి 2050 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్లలో..

ఏపీలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి 2050 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్లలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు, మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 550 రూపాయల కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కాలేజీల్లో 100 సీట్ల చొప్పున, మచిలీపట్నం మెడికల్‌ కాలేజీలో 150 సీట్లకు అవకాశం కలగనుంది. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందుల మెడికల్‌ కాలేజీల స్థలం కొనుగోలుకు 104 కోట్ల 17లక్షలతో పరిపాలన అనుమతులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story