YV Subba Reddy : కల్తీ నెయ్యి కేసు.. అన్ని వేళ్లు వైవీ సుబ్బారెడ్డి వైపే..

YV Subba Reddy : కల్తీ నెయ్యి కేసు.. అన్ని వేళ్లు వైవీ సుబ్బారెడ్డి వైపే..
X

కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. ఆయన హయాంలోనే ఇంతటి ఘోరం జరిగిందని ఇప్పటికే దాదాపు అందరికీ తెలిసిపోయింది. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసిపి ఎన్నో ఎత్తుగడలు వేస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులే కల్తీ నెయ్యి వాడారని.. ఒక రకంగా అసలు నెయ్యి కానీ కెమికల్ ను వాడారంటూ ఇప్పటికే చెప్పారు. అయితే ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలను రాబట్టేందుకు అప్పటి జిఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, బోలెబాబా డెయిరీ నిర్వాహకుడు అజయ్ సుగంధ్ ను మరో నాలుగు రోజులపాటు సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా వీరందరినీ విడివిడిగానే అధికారులు విచారించారు.

అందులో చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. కల్తీ జరిగిందని ముందే తెలిసినా సరే డెయిరీ నిపుణుడు సురేంద్రకు జిఎం సుబ్రహ్మణ్యం ఏం చెప్పారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే అప్పటికే నెయ్యి కల్తీ అయిందని మైసూరు ల్యాబ్ cfdri రిపోర్ట్ వచ్చింది. కానీ దీన్ని బయట పెట్టొద్దని సురేంద్రకు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఆలయ ఈవోకు తెలియకుండా ఎందుకు నొక్కిపెట్టారు అని సెట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు.

అయితే సుబ్రహ్మణ్యం మాత్రం ఆ రిపోర్టు విషయాన్ని తాను ముందే వైవీ సుబ్బారెడ్డికి చెప్పినట్టు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. మరి వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలిసినా రిపోర్టును కావాలనే నొక్కి పెట్టారా అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అజయ్ సుగంధ్ ఇంత ధైర్యంగా కల్తీ నెయ్యిని ఎవరి అండతో పంపారు.. టీటీడీ నుంచి ఆయనకు ఎలాంటి అభ్యంతరాలు రాలేవా.. ఎప్పటినుంచి దీన్ని మొదలుపెట్టారు అనే కోణంలో అధికారులు ప్రశ్నించబోతున్నారు. వీళ్ళిద్దరి నుంచి కీలక ఆధారాలు రాబట్టిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కరిగా ఎవరిని ప్రశ్నించినా సరే ఇప్పటివరకు అందరూ వైవి సుబ్బారెడ్డి పేరే చెబుతున్నారు. ఆయనకు ముందే చెప్పేశాము అన్నట్టు అందరూ సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఈ కేసులో బైపీసుబ్బారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరి ఈ నాలుగు రోజుల కస్టడీలో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.


Tags

Next Story