YS Jagan : వైసీపీలో మార్పులు సున్నా.. జగన్ తీరు మారదా..

YS Jagan : వైసీపీలో మార్పులు సున్నా.. జగన్ తీరు మారదా..
X

వైసిపి అధికారం పోయినా సరే జగన్ ఒక్క మార్పు కూడా చేయట్లేదు. ఏపీ ప్రజలు ఏ అరాచకాలను ఏ అవినీతిని వద్దు అని కూటమి ప్రభుత్వంకు ఓటేశారో అందరికీ తెలిసిందే. కానీ జగన్ వాటిని ఒప్పుకోవట్లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలు వద్దు అంటున్న దాన్ని కచ్చితంగా మార్చుకొని తీరాల్సిందే. లేకపోతే పార్టీకి మనుగడే ఉండదు. ఆ విషయాలు సేమ్ చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. అందుకే టిడిపిలో, జనసేనలో కొందరు అరాచక లీడర్లు ఉంటే వారిని పార్టీల నుంచి తీసి పాడేశారు. కానీ జగన్ మాత్రం అలా చేయట్లేదు. తన పార్టీలో ఎంత పెద్ద అవినీతిపరులు ఉన్నా సరే వారిని వెనకేసుకొస్తున్నారు. పైగా వాళ్ల అవినీతి గురించి సిబిఐ, సిఐడి, సిట్ అధికారులు బయట పెడుతుంటే జగన్ తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

మరీ దారుణం ఏంటంటే వాళ్లు చేసిన అసలు పెద్ద నేరాలే కాదన్నట్టు మాట్లాడుతున్నారు. మొన్న మూడు గంటలపాటు మీడియాతో మాట్లాడిన జగన్.. పరకామణిలో జరిగింది చాలా చిన్నచోరీ అని.. మహా అయితే 9 డాలర్లు అంటే 70000 మాత్రమే దోపిడీ జరిగితే.. అందుకు బదులుగా తాము కోట్లాది రూపాయల ఆస్తులు టీటీడీ బోర్డుకు రాయించామని చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే అంత గొప్ప ఆలయంలో చోరీ జరిగడం అంటే కోట్లాదిమంది హిందువుల నమ్మకాన్ని దెబ్బతీయటమే కదా. అంటే జగన్ దృష్టిలో వేల కోట్లు దోచుకుంటేనే దోపిడీ అవుతుందేమో. అంతకు తక్కువ దోచుకుంటే ఆయన దృష్టిలో దోపిడినే కాదన్నట్టు మాట్లాడుతున్నారు కూటమినేతలు.

జగన్ ఇలాంటి వ్యాఖ్యలను మానుకుంటేనే ఆయన పార్టీకి మను కూడా ఉంటుంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోకపోవడం ఏంటి. పైగా మీడియా ముఖంగానే వాళ్ళను సపోర్ట్ చేయడం ఏంటి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో అడ్డంగా దొరికిన వారిని కూడా జగన్ వెనకేసుకొస్తున్నారు. మద్యం లిక్కర్ లో దొరికిన నిందితులను కూడా వెనకేసుకొస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల జగన్ మీద ప్రజలకు మరింత వ్యతిరేకత పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. ఇప్పటికైనా జగన్ తన పార్టీలో ఉన్న అక్రమార్కులను శిక్షిస్తేనే ప్రజలు అంతో ఇంతో నమ్ముతారు. లేదంటే వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీ అనేది కూడా ఏపీలో ఉండకపోవచ్చు అంటున్నారు ఓటమినేతలు.

Tags

Next Story