Aghori Woman : వైజాగ్ బీచ్ రోడ్డులో అఘోరీ హల్చల్

అఘోరీ ఏపీలో ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం నంద్యాల జిల్లా ఆత్మకూరులో కనిపించిన లేడీ అఘోరీ ఆ తర్వాత గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో హల్‌చల్ చేసింది. ఆ తర్వాత రాత్రికి విశాఖ బీచ్‌కు చేరుకోవడంతో అక్కడ హంగామా చోటుచేసుకుంది. వైజాగ్ లోని శనిదేవ్ మహారాజ్ నిలయం కార్యక్రమంలో హాజరయ్యేందుకు అఘోరీ నాగసాధు చేరుకుంది. ఐతే.. అఘోరీని బీచ్ రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. బీచ్ రోడ్డులో అఘోరీ కారు దిగడంతో.. అక్కడ గందరగోళం ఏర్పడింది. జనాలు గుమికూడటంతో ట్రాఫిక్ జామ్ అయింది. అంతకుముందు అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కొద్దిసేపు అఘోరీ హల్‌చల్ చేసింది. రాజమండ్రి నుంచి విశాఖవైపు వెళ్తున్న అఘోరీ తన కారులో వేంపాడు టోల్‌ప్లాజా వద్దకు రాగా టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరారు. అయితే తన వద్ద ఫీజు తీసుకోడానికి వీల్లేదని, తాను చెల్లించనంటూ అఘోరీ వాగ్వాదానికి దిగింది. ఘర్షణ ఎందుకని ఫీజు తీసుకోకుండానే సిబ్బంది ఆమె కారును విడిచిపెట్టారు.
అంతకుముందు నక్కపల్లి వేంపాడు టోల్ ప్లాజా వద్ద మహిళా అఘోరి హల్‌చల్ చేసింది. 2 గంటలకుపైగా హైడ్రామా కొనసాగింది. టోల్‌గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారన్న అఘోరీ... నాగసాధుకే రక్షణ లేకపోతే మహిళల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అందుకే కలియుగం ఇలా మారిపోయిందన్నారు. సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని మహిళా అఘోరీ మరోసారి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com