మంత్రిగా కాకాణి విఫలం: లోకేష్

వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి విఫలమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి సీబీఐ ఎంక్వైరీలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రిగా అనిల్, వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఇద్దరూ ఫెయిలయ్యారన్నారు. ఓ ఎంపీ నకిలీ విత్తనాలు సరఫరా చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలను అరికడతామన్నారు.
సోమశిల హైలెవల్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన అయినా.. ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. వర్చువల్ శంకుస్థాపనల వల్ల పనులు నాశనం అయ్యాయని అన్నారు. ఇరిగేషన్ పనులను కూడా విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడే పని ఎక్కడ ప్రారంభమైందో చెప్పాలన్నారు. రైతుల సమస్యలపై లోకేష్ ప్రధానంగా దృష్టి పెట్టడం మంచి పరిణామం అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com