Gannavaram Airport : ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు

Gannavaram Airport : ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు
X

గన్నవరంలో విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు ఉండటంతో ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.

Tags

Next Story