CM Chandrababu : కుప్పంలో ఎయిర్ పోర్టు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మించడం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రూ. 850 కోట్లను కుప్పం విమానాశ్రయానికి ఖర్చు చేయబోతున్నామని.. దీంతో నియోజకవర్గ రూపురేఖలే మారుతాయని అభిప్రాయపడ్డారు. ఎయిర్ పోర్టుకు భూములివ్వొద్దని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని..వారి మాయలో పడొద్దని సీఎం సూచించారు. ఎయిర్ పోర్టుకు భూమి ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చామని గుర్తు చేశారు.
కుప్పంలో ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానెల్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ పెట్టుకునేంత వరకు ఊరుకునేలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్లకే కాదు వ్యవసాయానికి సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలని సూచించారు. కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తామన్న సీఎం.. పలమనేరు నుంచి కృష్ణగిరి రహదారికి 4 లేన్ల రహదారి వేస్తున్నట్లు తెలిపారు. కుప్పంలో బ్రహ్మండమైన అభివృద్ధి జరగబోతోందని.. నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ఓ అద్భుతమైన ప్రణాళిక తయారు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com