ప్రచారానికి వెళ్తే.. పేరంటానికా అన్నారు.. హేళన చేసిన మగవారిని..

ప్రచారానికి వెళ్తే.. పేరంటానికా అన్నారు.. హేళన చేసిన మగవారిని..
ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు ఊరిని మాత్రం ఎందుకు బాగు చేయదు. ఆమెకి ఓటేసి గెలిపిస్తే ఊరిని బాగు చేస్తుంది. మనల్నీ భాగస్వామ్యం చేస్తుంది.

ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు ఊరిని మాత్రం ఎందుకు బాగు చేయదు. ఆమెకి ఓటేసి గెలిపిస్తే ఊరిని బాగు చేస్తుంది. మనల్నీ భాగస్వామ్యం చేస్తుంది. అని అక్కడి ఆ పంచాయితీలోని ఆడవారితో పాటు మగవారూ అన్నారు. ఆమెకి ఓటేసి గెలిపించుకున్నారు.

ఒకరూ ఇద్దరూ కాదు విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొరమవోలు పంచాయితీలో నేతలందరూ మహిళలే. సర్పంచ్, వార్డు మెంబర్ వంటి పదవులన్నింటికీ గ్రామ ఓటర్లు మహిళలనే ఎన్నుకున్నారు. పురుషులు కూడా సరిసమానంగా బరిలోకి దిగినా వారిని కాదని ఆడవారికే పట్టంకట్టారు. ఊరి బాగు కోసం తీసుకనునే ఏ నిర్ణయం అయినా అండగా నిలబడతామన్నారు.


ఆ గ్రామ జనాభా మొత్తం 2100. పురుషులు 1104, మహిళలు 996. మొత్తం ఓటర్లు 1804. పురుషులే అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ మహిళలే విజయం సాధించారు. పొలం పని తప్ప మరొకటి తెలియదు. అయినా ఊరి బాగు కోసం వార్డు మెంబరుగా నిలబడ్డారు సత్యవతి. ఆమెకు పోటీగా బరిలోకి దిగిన పురుషులు ఓటమి పాలయ్యారు.

రాజకీయం తెలియదు.. రాజకీయ నేపథ్యం అసలే లేదు. అయినా పోటీచేసి గెలిచింది సత్యవతి. ప్రచారానికి వెళ్తే పేరంటానికి వెళ్తున్నారా అని అడిగేవారు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట పోతల గీతమ్మ అనే మహిళ సర్పంచ్‌గా పని చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లంతా మహిళలే పోటీ చేసి గెలిచారు అని ఊరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉదయాన్నే లేచి ఇంటి పని చూసుకుని పొలం పనులకు వెళ్లే ఆడవాళ్లు ఊరి బాగు కోసం కదిలి వచ్చారు. రాజకీయమంటే మన ఊరిని బాగు చేసుకోవడమే అని చెబుతారు ఏడో వార్డు నుంచి గెలుపొందిన సీతారామమ్మ.


సాధారణంగా స్త్రీలు రాజకీయాల్లోకి వస్తే వారి వెనుక వుండి నడిపించేది మగవారే అన్న అపవాదు ఉంది. ఆ ముద్రను చెరిపేసి మహిళ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలదని నిరూపిస్తామంటున్నారు కొమరవోలు మహిళలు. కచ్చితంగా గతంలో కంటే రానున్న ఐదేళ్లలో ఊరు ఎక్కువ అభివృద్ధి చెందుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొమరవోలు పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్టా ఉమాశంకర్ అభినందించారు. ఇది మహిళలు సాధించిన విజయమని అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం తరపున, వ్య్తక్తిగతంగా కూడా సాయం చేస్తామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story