Roja : అవినీతి 'రోజా'.. చెప్పేవన్నీ నీతులు.. చేసేవి ఇవేనా..?

మాజీ మంత్రి రోజా అవినీతి పనులు మొత్తం బయటకు వస్తున్నాయి. నోరు తెరిస్తే తన లాంటి పద్ధతి గల మహిళ లేదు అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కానీ అవతలి పార్టీ వాళ్లను మాత్రం బండ బూతులు తిట్టేస్తుంటారు. పైకి నీతులు చెబుతూ అవతలి వారిని తిట్టే రోజా.. తన దాకా వస్తే మహిళా కార్డును వాడేస్తుంటారు. కానీ తాను మహిళా నాయకురాలిని అని మరిచిపోయి.. విచ్చలవిడిగా అక్రమాలు, అవినీతి చేసింది రోజా. క్రీడాశాఖ మంత్రిగా ఉన్న రోజా.. తన హయాంలో భారీ అక్రమాలకు పాల్పడింది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలిసి దాదాపు రూ.40 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వీరిద్దరూ కలిసి చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వీళ్లిద్దరూ కలిసి నిధులు మొత్తం పక్కదారి పట్టించారు.
ఈ విషయాలను విజిలెన్స్ కమిటీ మొత్తం బయటపెట్టింది. గ్రామాలకు రూ.10వేలు ఖర్చు పెడితే.. ఇంకో రూ.10వేలు తమ సొంత ఖర్చులకు పెట్టుకున్నారు. ఇలా ప్రతి కేటాయింపుల్లో డబుల్ ఖర్చులను చూపించి.. సొమ్మును దోచేశారు. దాదాపు 600 ప్రాంతాల్లో విజిలెన్స్ పర్యటించి.. వందల మందితో మాట్లాడిన తర్వాత 30వేల పేజీల రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది విజిలెన్స్ కమిటీ. దీంతో రోజా మీద ఏపీ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇంత దారుణానికి పాల్పడుతూ.. పైకి మాత్రం పెద్ద నిజాయితీ గల లీడర్ లాగా బిల్డప్ లు ఇస్తావా అంటూ ఏకిపారేస్తున్నారు జనాలు. రోజా చేస్తున్న అక్రమ పనులు మొత్తం ఇప్పుడు బయటకు రావడంతో.. ఆమె నీళ్లు నములుతోంది. ప్లాన్ ప్రకారం దొరకకుండా దోచేశాం అని ఇన్ని రోజులు ధైర్యంగా ఉంది కాబోలు. కానీ ఇప్పుడు తన అక్రమ కూపీ మొత్తం బయటకు వస్తుండటంతో.. ఏం చేయాలో అర్థం కాక.. తల పట్టుకుంటోంది ఈ మాజీ మంత్రి.
Tags
- RK Roja
- Andhra Pradesh Politics
- YSRCP Leader Roja
- AP Political Controversy
- Corruption Allegations
- Adudam Andhra Scheme
- Sports Ministry Andhra Pradesh
- AP Vigilance Report
- Baireddy Siddharth Reddy
- SAP Chairman Andhra Pradesh
- Financial Irregularities
- Governance in Andhra Pradesh
- Public Funds Misuse
- Political Accountability
- Andhra Pradesh News
- Indian Regional Politics
- Vigilance Committee Findings
- AP Government Investigations
- Political Allegations in India
- Ethics in Public Office
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
