YS Jagan : కల్తి నెయ్యి కేసు.. ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్రలు

వైసిపి హయాంలో కలియుగ దైవం శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు విచారణ పూర్తయిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 60 లక్షల కేజీలకు పైగా నెయ్యిని కెమికల్ తో తయారుచేసి శ్రీవారి లడ్డూల్లో కలిపేసి కోట్లాదిమంది హిందువులతో తినిపించిన పాపం వైసిపిది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీట్ తేల్చి చెప్పింది. ఇప్పుడు అంత పెద్ద నేరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసిపి కొత్త కుట్రలకు తెరతీసింది. ఏదో ఒకటి చేసేసి కల్తీ నెయ్యి నుంచి వేరే ఇష్యూ మీదకు అందరి చూపులు డైవర్ట్ చేయాలన్నదే జగన్ ప్లాన్. అందులో భాగంగానే అంబటి రాంబాబు అత్యంత దారుణమైన బూతులు తిట్టారు. నార్మల్ గా మాట్లాడితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు కాబట్టి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడును అంబటి రాంబాబుతో బూతులు తిట్టించారు జగన్.
ముందస్తుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అంబటి రాంబాబు ఇంటి మీద వైసిపి బ్యాచ్ దాడులు చేసి దాన్ని టిడిపి వాళ్ళ మీదకు నెట్టేసింది. ఆ తర్వాత జోగి రమేష్ తో కూడా మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయించారు జగన్. అక్కడ కూడా సేమ్. టిడిపి కార్యకర్తల గ్రూపులోకి వైసిపి బ్యాచ్ చొరబడి జగన్ ఆదేశాల ప్రకారమే జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంకేముంది మీడియా, సోషల్ మీడియా దృష్టి మొత్తం ఈ దాడుల మీదకే వెళ్లిపోయింది. దీంతో ప్రజలు కూడా ఆటోమేటిక్ గా ఈ రెండు ఘటనల గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్ కు కావాల్సింది కూడా ఇదే.
ఎందుకంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి లడ్డులో కెమికల్ తో తయారు చేసిన నెయ్యిని కలపడం అంటే హిందువుల మనోభావాల మీద దాడి చేయడమే. శ్రీవారి భక్తులు, హిందువులు జగన్ మీద, వైసిపి పార్టీ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాబట్టి వాళ్ల దృష్టిని మళ్ళించడం కోసమే ఇలాంటి భయంకరమైన కుట్రలకు తెరతీస్తున్నారు జగన్. ఏపీలో శాంతిభద్రతలను ప్రమాదంలో పడేస్తున్నారు మాజీ సీఎం.
Tags
- Tirumala Laddu adulteration case
- YSRCP controversy
- ghee adulteration allegations
- Supreme Court SIT inquiry
- Jagan Mohan Reddy politics
- diversion tactics allegations
- Ambati Rambabu remarks
- Jogi Ramesh issue
- Chandrababu Naidu controversy
- Nara Lokesh comments
- Andhra Pradesh political news
- Hindu sentiments debate
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
