Andhra Pradesh News: కూటమి అభివృద్ధి బాటలు.. వైసీపీ బ్యాచ్ హడల్..

Andhra Pradesh News: కూటమి అభివృద్ధి బాటలు.. వైసీపీ బ్యాచ్ హడల్..
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి జపం చేస్తోంది. వరుసగా ఇంటర్నేషనల్ కంపెనీలను తీసుకు వచ్చి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, రాజధాని అమరావతిలో స్పీడ్ గా పనులు, కడపలో మ్యాను ఫ్యాక్చరింగ్ కంపెనీల జోరు.. ఇంకోవైపు సంక్షేమ పథకాలతో కూటమి ఇమేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వైసీపీ బ్యాచ్ కు అస్సలు నిద్ర పట్టట్లేదంట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి అసలే లేదు. ఒక్క కంపెనీ రాలేదు. నవరత్నాల పేరుతో వేల కోట్లు ధ్వంసం చేశారు. ఉన్న కంపెనీలు వెళ్లిపోయేలా భయపెట్టారు. వాళ్ల అరాచకాలతో కొన్ని రోజులకే వైసీపీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది.

ఇప్పుడు కూటమి మీద కూడా అలాగే వ్యతిరేకత వస్తుందేమో అని వైసీపీ బ్యాచ్ ఎదురు చూసింది. కానీ కూటమి వాళ్ల లాగా కాదు కదా.. వరుసగా అభివృద్ధి పనులు చేస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ ఇమేజ్ పెరుగుతోంది. ఇలా అయితే కుదరదు అని.. జగన్ అండ్ బ్యాచ్ కూటమి ప్రభుత్వం మీద రకరకాలుగా బురద జల్లేందుకు ప్రయత్నించారు. ఏపీలో ఎరువుల కొరత లేకున్నా ఉన్నట్టు ఫేక్ ప్రచారం చేశారు. ఉల్లికి అడగక ముందే సీఎం చంద్రబాబు గిట్టుబాటు ధర ప్రకటించినా.. వైసీపీ మాత్రం అబ్బే కూటమి పట్టించుకోవట్లేదు అని కల్లబొల్లి మాటలు చెప్పింది. నకిలీ రైతులను ఏర్పాటు చేసి మద్యం తాగించి పురుగుల మందు తాగారని డ్రామా ఆడించారు. చివరకు అడ్డంగా దొరికిపోయారు.

మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కు అమ్మేస్తోందని ఫేక్ ప్రచారం చేశారు మాజీ సీఎం జగన్ అండ్ బ్యాచ్. కానీ ఇవేవీ ప్రజలు నమ్మకపోవడంతో జగన్ అండ్ టీమ్ అయోమయంలో పడిపోయింది. తాము కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదనే ఆందోళన వాళ్లలో పెరిగింది. ఇలా అయితే తమ పార్టీ మనుగడ కూడా ఏపీలో కష్టమే అని వైసీపీ నేతలు భయపడుతున్నారు. అందుకే ఎంతకైనా తెగించేసి కూటమి మీద దుష్ప్రచారం చేయాలని జగన్ ఆదేశించారంట. అడ్డగోలు అబద్దాలు చెప్పి, ప్రజల్లో కులాల మధ్య గొడవలు పెట్టి.. ఏపీలో అలజడి సృష్టించాలని కుట్రలు చేస్తున్నారంట వైసీపీ బ్యాచ్. కానీ వాళ్లు ఎన్ని చేసినా సీఎం చంద్రబాబు ఎత్తుగడల ముందు దిగదుడుపే అన్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. ఎవరు మాటలు చెబుతున్నారు.. ఎవరు అభివృద్ధి చేస్తున్నారనేది వాళ్ల కండ్ల ముందే కనిపిస్తోంది. అందుకే వారంతా కూటమికే మద్దతు అంటున్నారు.

Tags

Next Story