YSRCP : వైసీపీ అంటేనే ప్రమాదం.. ఈ స్కాములే నిదర్శనం..

వైసీపీ అంటేనే ఏపీకి అత్యంత ప్రమాదం అంటున్నారు కూటమి నేతలు. ఎందుకంటే ఆ పార్టీ ఐదేళ్ల అధికారంలో చేసిన అరాచకాలు, స్కాములు, కుట్రలు, విధ్వంసం ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. ఎవరూ కనీవినీ ఎరగని రీతిలో అరాచక పాలన సాగించారు జగన్. తన హయాంలో ఏపీని యాభై ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారు. అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేశారు. ఒక్క డెవలప్ మెంట్ కూడా చేయలేదు. రాజధాని లేకుండా రాక్షస పాలన సాగించారు. ఇక స్కాముల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. కల్తీ లిక్కర్, లిక్కర్ స్కామ్, చివరకు టీటీడీలో కల్తీ నెయ్యి కుంభకోణాలు.. ఇలా అడుగడుగునా కుంభకోణాలతో రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూశారు. వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు మాత్రం తమ తప్పేం లేదన్నట్టు ప్రగడ్బాలు పలుకుతున్నారు. ఇప్పటికే కల్తీ లిక్కర్ స్కాములో కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అన్ని రకాలుగా విచారణ సాగిస్తున్నారు. దాంతో వైసీపీ నేతలు ఏ విధంగా సొమ్మును తమవైపు మళ్లించుకున్నారు తెలిసిపోతోంది. అటు కల్తీ నెయ్యి విషయంలో ఏకసభ్య విచారణ కమిషన్ వేగంగా పనిచేస్తోంది. ఇప్పటికే విచారణను చాలా వరకు కంప్లీట్ చేస్తోంది కమిషన్. ఇలా అన్ని కేసులు ఒక్కొక్కటిగా వైసీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. దాంతో వైసీపీ నేతలు ప్రజల దృష్టిని వీటి నుంచి మళ్లించేందుకు కులాల మధ్య చిచ్చులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ల ప్రయత్నాలు పెద్దగా సాగకపోయినా సరే ఏదో ఒక విధంగా ఏపీలో అశాంతిని రాజేయాలని చూస్తున్నారు.
Tags
- YS Jagan Mohan Reddy
- YSR Congress Party controversy
- Andhra Pradesh politics
- AP liquor scam investigation
- adulterated liquor scam AP
- TTD ghee controversy
- Andhra Pradesh corruption allegations
- ED money laundering probe AP
- YSRCP leaders investigation
- AP political news
- coalition leaders criticism YSRCP
- Andhra politics latest updates
- corruption allegations YSRCP
- AP governance controversy
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
