AMARAVATHI: లక్ష ఎకరాల్లో అమరావతి వైభవం..!

AMARAVATHI: లక్ష ఎకరాల్లో అమరావతి వైభవం..!
X
మారుతున్న చంద్రబాబు లెక్కలు... మరో 44 వేల ఎకరాల సేకరణకు సిద్ధం... మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులు ఆరంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. దీనిని నభూతో నభవిష్యతి అన్నవిధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రస్తుత ఎన్టీఏ ప్రభుత్వం కూడా అందుకు అనుకూలంగా వేగంగా కార్యచరణ రూపొందిస్తోంది. ఈక్రమంలోనే రాజధాని పునఃనిర్మాణ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మే 2వ తేదీన అమరావతికి వచ్చే ప్రధానికి అరుదైన స్వాగతం పలకనున్నారు. భారీ రోడ్డు షో కూడా నిర్వహించనున్నారు. ప్రధాని ప్రసంగించే ఈ సభలో అమరావతి రైతులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తారు.

మోదీ కీలక సూచనలు

రాజధాని పనుల పునః ప్రారంభానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. మే రెండవ తేదీన ప్రధాని అమరావతి పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సమయంలో చంద్రబాబు రాజధాని కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు. వాటన్నింటిని సావధానంగా విన్న ప్రధాని ఒక సూచన చేసినట్లు తెలుస్తోంది. అమరావతిలో కూడా జపాన్ లోని 'మియావాకి' విధానం అమలు చేయాలని సూచించారు.

మొత్తం లక్ష ఎకరాలు

మరోవైపు అమరావతి నిర్మాణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను సేకరించిన సర్కారు దానిని కాస్త విస్తరించి 54 వేల ఎకరాలకు తీసుకొచ్చింది. ఇప్పుడు మరో 44 వేల ఎకరాలను కూడా సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మూడు మండలాల పరిధిలో 11 గ్రామాలను గుర్తించారు. ఇక కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపుకుంటే రాజధాని ప్రాంతం లక్ష ఎక రాలకు వరకు చేరుకుంటుంది. ఇందుకోసం వారం రోజుల్లోగా నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. గుంటూ రు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు భూసమీకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చిన వెంటనే CRDA సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టేందుకు 2015 లో భూ సమీకరణ చేపట్టారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల ప్రాంతంలో కాపిటల్ నిర్మాణం చేపడతామన్నారు. ఆనాడు రైతులు కూడా స్వచ్చందంగా భూములిచ్చారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ తదనంతర కాలంలో ప్రభుత్వాలు మారడం, రాజధాని నిర్మాణమే ఆడిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడి రైతులకు ఇప్పటి వరకూ కూడా ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు.

Tags

Next Story