AMARAVATHI: 1300 రోజులకు చేరిన ఉద్యమం..

అమరావతి ఉద్యమం ఇవాల్టితో 1300 రోజులకు చేరింది. ఈ సంధర్బంగా.. ఇవాళ మందడం శిభిరంలో నాలుగేళ్ల నరకంలో నవనగరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉద్యమానికి తొలి నుంచి అండగా నిలిచిన అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారు.
అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ ఉద్యమాన్ని రైతులు కొనసాగిస్తున్నారు.నిన్న రాజధాని రైతులు మహిళలు ఆలయ ప్రదర్శన యాత్ర నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ ఆలయం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ఉద్యమం ఆగదని అమరావతి రైతులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com