AP: జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా.

అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం,, దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా ఉన్న అమరావతి.. ఇప్పుడు చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్లోపు ఖరారు చేయాలని భావిస్తోంది.
డిసెంబర్ నుంచి వేగంగా పనులు
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రాజధానికి రూ 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసాయి. ఇదే సమయంలో అమరావతికి రోడ్డు, రైలు కనెక్టివిటీ పైన కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమైన వేళ అమరావతి కనెక్టివిటీ పైన కీలక హామీ దక్కింది.
అవుటర్ నిర్మాణానికి వేగంగా పనులు
అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది ఎలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ అధికారులు దృష్టిపెట్టారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. వాస్తవంగా 2018లో దీని ఎలైన్‌మెంట్ ఖరారు చేయగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. రాజధానిపై అక్కసుతో ఓఆర్‌ఆర్‌ను పక్కనపెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీ వెళ్లి.. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఓఆర్‌ఆర్‌కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే అవుటర్ రింగ్ రోడ్డుకు గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ ఎలైన్‌మెంట్ రూపకల్పన, డీపీఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామంటూ గతంలోనే ఎన్‌హెచ్‌ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్‌ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో.. ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలంటూ ఇక్కడి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి వచ్చింది. దీంతో ఆ సంస్థతో ఈ వారంలో ఎన్‌హెచ్‌ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com