భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విశాఖ ఉక్కు కార్మికులు

భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విశాఖ ఉక్కు కార్మికులు
దేశంలోని రైతులందరికీ సీఎం జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు విశాఖ ఉక్కు కార్మికులు. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 43 రోజులుగా ఉద్యమిస్తున్నారు కార్మికులు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. రైతులు, ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్రం తీరుని నిరసిస్తూ బంద్‌లో పాల్గొంటున్నారు విశాఖ ఉక్కు కార్మికులు. కేంద్ర ప్రభుత్వ తీరుపై స్టీల్‌ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు.

అటు ఈ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైతు భక్షక చట్టాలు, ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని..పార్టీ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. బంద్‌ గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని విమర్శించారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్‌లో వైసీపీ మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పోస్కోతో చీకటి ఒప్పందం చేసుకోలేదా అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ఇప్పుడు అసలు బండారం బయటపడ్డాక... వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.. దేశంలోని రైతులందరికీ సీఎం జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.

Tags

Read MoreRead Less
Next Story