Amaravati: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి.. కానీ షరతులు వర్తిస్తాయి..

Amaravati: అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.. అమరావతి రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.. న్యాయస్థానం ట దేవస్థానం పేరుతో నవంబరు ఒకటి నుంచి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రకు రైతులు సిద్ధమయ్యారు..
అయితే, అమరావతి జేఏసీ పాదయాత్రకు డీజీపీ అనుమతించలేదు.. దీంతో వారు హైకోర్టుకు వెళ్లారు.. హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహతుకమైన కారణాలు లేవని పిటిషనర్ల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. దీనిపై జోక్యం చేసుకున్న హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇస్తే అభ్యంతరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనుమతి నిరాకరణలో సహేతుకమైన కారణాల లేవని చెప్పింది.
అయితే, రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com