AP: 1300 రోజుకు చేరిన అమరావతి రైతుల ఉద్యమం

అమరావతిఉద్యమం అలుపెరుగకుండా సాగుతోంది.. ఉద్యమం 1300 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీ వెళ్లాలని రైతులు నిర్ణయించారు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రులు, అఖిలపక్ష నేతలను అమరావతి జేఏసీ నేతలు కలవనున్నారు.. అమరావతి రైతులు చేపడుతున్న ఉద్యమాన్ని, ఏపీ రాజధాని అంశాన్ని అఖిలపక్ష నేతలకు వివరించనున్నారు.
అమరావతే ఏపీ ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం ఇక ఈనెల 9 నాటికి 1300 రోజులు పూర్తిచేసుకోనుంది.. 1300 రోజులుగా వివిధ రూపాల్లో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.. ప్రభుత్వం దమననీతిని ఎదురొడ్డి పోరాడుతున్నారు.. మరోవైపు సుప్రీంకోర్టులో అమరావతి అంశం విచారణలో ఉంది.. ఈనెల 11న మూడురాజధానుల కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.. దీంతో సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ రాజధాని ఏదో ముఖ్యమంత్రి జగన్ స్పష్ఠం చేయాలని అమరావతి జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ఉద్దేశపూర్వకంగా మార్చారని ఆరోపించారు.. కావాలని అమరావతిలో ఆర్5 జోన్ క్రియేట్ చేశారన్నారు.. రాజధానిలో ఇల్లు ఇచ్చారంటే రాజధాని విశాఖకు మార్చే అవకాశం లేదన్నారు.. పేదలకు ఇళ్లు ఇస్తున్న ముఖ్యమంత్రి అమరావతిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.. ముఖ్యమంత్రి తీరు సమయాన్ని వృధా చేస్తున్నట్లు ఉందని మండిపడ్డారు.. టిడ్కో ఇళ్లపై కేంద్రం అడిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదన్నారు.. అమరావతి ముగింపు లేని అంశంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమరావతి జేఏసీ నేతలు మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com