Amaravati : టీవీ5 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన రాజధాని రైతులు

Amaravati :  టీవీ5 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన రాజధాని రైతులు
Amaravati : అమరావతి ఉద్యమంలో తమ వెంట నడిచి.. అండగా ఉన్న టీవీ5కి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు.

Amaravati : అమరావతి ఉద్యమంలో తమ వెంట నడిచి.. అండగా ఉన్న టీవీ5కి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు. 2019 డిసెంబర్ 18న వెలగపూడిలో ఊపిరిపోసుకున్న అమరావతి ఉద్యమ గళం నుంచి.. న్యాయస్థానంలో అంతిమ విజయం వరకు మద్దతుగా నిలిచిన టీవీ5 యాజమాన్యానికి పాదాభివందనాలు అన్నారు. ప్రభుత్వ కుట్రలను ఎత్తిచూపుతూ.. తమ అలుపెరుగని పోరాటాన్ని ఐదు కోట్ల ప్రజానీకానికి సగర్వంగా కళ్ల ముందుంచిందని తెలిపారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు, కేసులకు భయపడకుండా ధైర్యంగా నిలబడిన టీవీ5 యాజమాన్యానికి అమరావతి రైతులు, మహిళలు, జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.


Tags

Next Story