Amaravati: కార్యరూపం దాల్చని అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు..

Amaravati: కార్యరూపం దాల్చని అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు..
Amaravati: స్మార్ట్ సిటీల మిషన్‌లో భాగంగా అమరావతికి నిధుల కేటాయింపు దక్కలేదు.

Amaravati: స్మార్ట్ సిటీల మిషన్‌లో భాగంగా అమరావతికి నిధుల కేటాయింపు దక్కలేదు. అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదు. దేశంలోని ఇతర స్మార్ట్‌ సిటీల ప్రాజెక్టులతో పాటు ఏపీలోని మరో మూడు స్మార్ట్ సిటీలకు ప్రతి ఏడాది కేంద్రం నిధుల కేటాయిస్తోంది. స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టు కింద ఏపీలోని అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖ ఎంపిక చేసింది.

అమరావతి స్మార్ట్‌ సిటీకి 2017-18లో 18 కోట్ల రూపాయలు కేటాయించగా.. 2018-19లో రూ. 372 కోట్లు 2019-20లో రూ. 106 కోట్లు కేటాయించింది కేంద్రం. అయితే 2020 నుంచి అమరావతి స్మార్ట్ సిటికి నిధుల కేటాయింపు లేవు. ఇప్పటివరకు 496 కోట్లు కేటాయించగా.. 488 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇక మిగిలిన మూడు నగరాలు కాకినాడ, తిరుపతి, విశాఖకు ప్రతి ఏడాది నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి.

కాకినాడలో మొత్తం 99 ప్రాజెక్టులకు గాను ఒక వెయ్యి 15 కోట్ల విలువైన 60 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అలాగే తిరుపతిలో మొత్తం 88 ప్రాజెక్టులకు గాను 189 కోట్ల విలువైన 34 పనులు పూర్తి కాగా.. విశాఖలో మొత్తం 62 ప్రాజెక్టులకు గాను 680 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కానీ..అమరావతిలో మాత్రం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనుల్లో ముందడుగు పటడం లేదు. ఇప్పటివరకు పనులు ఆర్డర్ దశలోనే ఉన్నాయి. అమరావతిలో మొత్తం 2 వేల 46 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గాను.. కేవలం 21 ప్రాజెక్టులు మాత్రమే చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story