Andhra Pradesh News : అమరావతి.. సీఎం చంద్రబాబు తిరుగులేని కృషి..

Andhra Pradesh News : అమరావతి.. సీఎం చంద్రబాబు తిరుగులేని కృషి..
X

అమరావతిని అడ్డుకోడానికి జగన్ బ్యాచ్ ఎన్ని రకాల కుట్రలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకసారి వైసీపీకి అధికారం ఇస్తేనే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. మూడు రాజధానుల పేరుతో జగన్ చాలా డ్రామాలు ఆడి.. చివరకు ఏపీకి రాజధాని లేకుండా చేశారు. ఇన్ని రకాల కుట్రలతో జగన్ విరుచుకుపడుతుంటే.. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతోంది. సీఎం చంద్రబాబు చాలా దూరదృష్టిలో ఆలోచించి మరోసారి వైసీపీకి అవకాశం ఇవ్వకుండా చూస్తున్నారు. అమరావతిని ఎవరూ టచ్ చేయకుండా చట్టబద్ధత కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే అమరావతిని ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి రాష్ట్రానికి రాజధాని లేని లోటును పూడ్చాలని సీఎం ఆలోచిస్తున్నారు.

అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకువచ్చి ఏపీ ప్రగతిని పెంచుతున్నారు. ఇలా రాజధానిని డెవలప్ చేసి.. ఇంకోవైపు చట్టబద్ధత కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఈలోగా మాజీ సీఎం జగన్.. మావిగన్ అంటున్నారు. ఇంకోసారి అమరావతి పూర్తిగా మునిగిపోతుందని చెబుతున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇన్ని చేస్తున్నా సరే జగన్ మాత్రం అమరావతిని అడ్డుకోవడం కష్టమే అని వైసీపీ బ్యాచ్ కు అర్థం అయింది.

అలాగే ఏపీ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. రాజధాని కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. అడ్డుకోవడానికి జగన్ చేస్తున్నే కుట్రలను క్లుప్తంగా చూస్తున్నారు. కాబట్టి జగన్ ఎన్ని రకాల కుట్రలు చేసినా సరే ప్రజలు అన్నీ గమనించి సరైన బుద్ధి చెబుతారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా సీఎం చంద్రబాబు ఆలోచన ముందు ఓడిపోతారని చెబుతున్నారు.

Tags

Next Story