AP : వ్యవస్థల మేనేజర్ చంద్రబాబు వైసీపీని తొక్కలేరు..అంబటి హాట్ కామెంట్స్

AP : వ్యవస్థల మేనేజర్ చంద్రబాబు వైసీపీని తొక్కలేరు..అంబటి హాట్ కామెంట్స్
X

కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒక్క పార్టీని తొక్కాలని చూస్తే అది మరింతపైకి లేస్తోందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతోందని విమర్శించారు. రెడ్ బుక్ లో ఎవరి పేరు ఉంటే వారిని అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాసిన లోకేష్, దీన్ని అమలు చేస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైలులో ఉన్న వైసీపీ నేత పోలూరి రాజశేఖర్ రెడ్డి, సుధారాణి ఆమె భర్త వెంకట రెడ్డిని అంబటి రాంబాబు రామర్శించారు.

Tags

Next Story