Ambati Rambabu : మళ్లీ కులం కార్డు వాడుతున్న అంబటి, ముద్రగడ.. ఇక మారరా..?

Ambati Rambabu  : మళ్లీ కులం కార్డు వాడుతున్న అంబటి, ముద్రగడ.. ఇక మారరా..?
X

మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కులం కార్డు వాడటం స్టార్ట్ చేసేశారు. అంతకు ముందు ముద్రగడ పద్మనాభం ఎక్కువగా పవన్ కల్యాణ్‌ మీదకు కులం కార్డుతో దాడి చేసేవారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అదేంటో గానీ.. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఎక్కువగా ఎంచుకుంటున్న మార్గం ఇదే. ఏ వైసీపీ నాయకుడి అరెస్ట్ జరిగినా సరే.. వెంటనే కులం కార్డును బయటకు తీస్తున్నారు. వాళ్లు ఎన్ని నేరాలు, అక్రమాలు చేసినా సరే అరెస్ట్ చేయొద్దు.. ఒకవేళ చేస్తే మాత్రం కులం సింపతీ కార్డును వాడేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పుడు అందరికీ తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మొన్న మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అయితే ఇలాగే కులం కార్డు వాడేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఏకంగా సీఎం చంద్రబాబును బూతులు తిడితే పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఇక్కడ కూడా కులం కార్డును వాడేస్తున్నారు. కాపు కులాన్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే మొన్న విజయవాడలో కాపు సంఘం నేతలను కొందరిని పిలిపించుకుని తనకు మద్దతు ఇస్తున్నట్టు ఏదో సింపతీ డ్రామా ఆడేశారు. అంటే సీఎం చంద్రబాబును బూతులు తిట్టినా సరే అరెస్ట్ చేయొద్దా.. ఇది ఎక్కడైనా ఉందా. అంటే రేపటి నుంచి కరుడు గట్టిన నేరస్థులు అందరూ అరెస్టులు చేస్తే కులం కార్డులు వాడుతామంటే.. అరెస్ట్ చేయకుండా వదిలేయాలా.

ముద్రగడ పద్మనాభం జనసేనను ఓడించేందుకు ఎన్ని రకాలుగా కులం కార్డు వాడేశారో మనం చూశాం. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన కాపు నేతలు అందరూ కూడా వరుసగా కులం కార్డును వాడేసేందుకు రెడీ అవుతున్నారు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఎంతలా వాళ్లు డిసైడ్ అయ్యారో ఇక్కడే అర్థం అయిపోతోంది. వైసీపీని అధికారంలోకి తీసుకురావాలంటే అభివృద్ధఙ పేరుతో రాజకీయాలు చేస్తే ఒక అర్థం ఉంటుంది గానీ.. ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు.

Tags

Next Story