Ambati Rambabu : అంబటి రాంబాబు అరాచకం.. కూటమి రెస్పాన్స్ అదుర్స్..

Ambati Rambabu : అంబటి రాంబాబు అరాచకం.. కూటమి రెస్పాన్స్ అదుర్స్..
X

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏ స్థాయిలో రెచ్చిపోయి ఇవాళ మాట్లాడారో చూశాం. సీఎం చంద్రబాబు నాయుడు మీద అత్యంత దారుణమైన భాషను వాడారు అంబటి రాంబాబు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని ఎవరూ ఊహించలేదు. కానీ తన స్థాయిని మర్చిపోయి తన అసలు రూపాన్ని బయటపెట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన వ్యాఖ్యలపై కూటమి నేతల రెస్పాన్స్ అదుర్స్ అన్నట్టే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాయి. అంబటిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. అటు జనసేన పార్టీ స్పందిస్తూ.. అంబటి వ్యాఖ్యలు అత్యంత దారుణం అంటూ ఖండించింది. వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది ఆ పార్టీ.

ఇంకోవైపు టీడీపీ నేతలు అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు నిరసనలు తెలిపారు. ఇలాంటి దారుణాలను సహించేది లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. అంబటి ఇంటి వద్దే రాత్రిదాకా ఆందోళన చేస్తూనే ఉన్నారు.

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబటి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంలో సహించేది లేదంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పోలీసు కేసులు నమోదవుతున్నాయి.

Tags

Next Story