Amit Shah : ఏపీకి 18న అమిత్ షా రాక

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్టీఆ ర్ఎఫ్, ఎస్ఐడీఎం ప్రాంగణాలను ఆయన ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం ఎస్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆ ర్ఎఫ్ పదో బెటాలియన్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మో హన్ నాయుడు, బండి సంజయ్, డిప్యూ టీసీఎం పవన్, రాష్ట్ర హోంమంత్రి అనిత, తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం షా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఏపీకి పలు వరాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com