Amit Shah : అమరావతికి అమిత్ షా రాక.. షెడ్యూల్ ఇదే

Amit Shah : అమరావతికి అమిత్ షా రాక.. షెడ్యూల్ ఇదే
X

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. నేడు ఏపీకి రానున్న అమిత్‌ షా..సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ విందుకు హజరవుతారు. సీఎం చంద్రబాబుతో అమిత్‌ షా భేటీ కానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. రేపు విజయవాడ సమీపం కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ క్యాంపులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

Tags

Next Story