ప్రధానికి బహిరంగ లేఖ రాసిన పలు అమరావతి జేఏసీలు...!

ప్రధానికి బహిరంగ లేఖ రాసిన పలు అమరావతి జేఏసీలు...!
ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుకోవాలన్న మోదీ.. అమరావతి కోసం పుణ్య నదుల నుంచి నీళ్లు, పవిత్ర స్థలాల నుంచి మట్టి తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.

అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకున్న సందర్భంగా ప్రధానికి బహిరంగ లేఖ రాశాయి పలు జేఏసీలు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న ప్రధానికి.. అమరావతి కష్టాలు బాగా తెలుసంటూ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుకోవాలన్న మోదీ.. అమరావతి కోసం పుణ్య నదుల నుంచి నీళ్లు, పవిత్ర స్థలాల నుంచి మట్టి తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. అమరావతి కోసం కేంద్రం 1500 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అర్ధంపర్ధం లేని మూడు రాజధానుల సిద్ధంతం తీసుకొచ్చిందన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని, రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో రాష్ట్ర ప్రగతి అంధకారం అయిందని గోడు విన్నవించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story