PUBG Game : ప్రాణాల మీదకు తెచ్చిన పబ్‌జీ గేమ్... తల్లిదండ్రులను గుర్తుపట్టలేకపోతున్న బాలుడు.!

PUBG Game : మొబైల్ గేమ్స్ చిన్నారుల పాలిట శాపంలా మారాయి. ఈ గేమ్‌లకు ఆడిక్టై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు పిల్లలు. తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ విద్యార్థి పబ్‌జీ ఆడుతూ స్పృహ కోల్పోయాడు. బెడ్‌పై ఉన్న ఈ బాలుడు చూడ్డానికి బానే కనిపిస్తున్నా.. రెండ్రోజుల వరకు ఎవరినీ గుర్తుపట్టడం లేదు. కన్న తల్లిదండ్రులనే ఎవరు మీరని ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది పబ్‌జీ గేమ్. గంటల తరబడి గేమ్‌లో మునిగిపోవడంతో కన్నవారిని సైతం గుర్తు పట్టలేని స్థితికి వెళ్లాడు.
పెద్దవడుగూరు మండలానికి చెందిన బాలుడు 8వతరగతి తరగతి చదువుతున్నాడు. రోజూ గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్నాడు. మూడు నెలల నుంచి రాత్రుళ్లు అదేపనిగా పబ్‌జీ ఆడుతూ ఇంట్లో ఆకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత ఎవరినీ గుర్తుపట్టలేదు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు బాలుడు. తన కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఒక్క ప్రవీణ్ పరిస్థితే కాదు... గతంలోనూ ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. చెన్నైలో ఓ బాలుడు మొబైల్ వీడియో గేమ్‌కు అడిక్ట్ అయి ఆసుపత్రిలో చేరాడు. బెడ్‌పై కూడా గేమ్ ఆడుతున్నట్టు చేతులు ఆడిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల చికిత్స తర్వాత కోలుకున్నాడు.మరోవైపు.... మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలలు కోల్పోయారు. ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీ కొట్టింది. ట్రాక్ పక్కన బైక్‌ను ఉంచి పట్టాలపై కూర్చుని పబ్‌జీ ఆడతుండగా వారిని రైలు ఢీ కొనడంతో చనిపోయారు. వర్చువల్ వరల్డ్‌లో విహరిస్తున్నామంటూ అంటూ చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తోంది.
ఎంత వారించినా మానడం లేదు. కొంత మంది యువకులు కూడా….వీడియో గేమ్‌లకు అలవాటు పడి కష్టాలు కొనితెచ్చుకున్నారు. కాసేపు ఆడితే ఏం కాకపోవచ్చు. కానీ గంటల తరబడి అందులోనే ఉంటే మాత్రం దూరం పెట్టాల్సిందేనంటున్నారు వైద్యులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com