అంధులైన తల్లిదండ్రులు.. కుటుంబానికి అండగా ఎనిమిదేళ్ల బాలుడు..!

అంధులైన తల్లిదండ్రులు.. కుటుంబానికి అండగా ఎనిమిదేళ్ల బాలుడు..!
తల్లిదండ్రుల తినిపిస్తే తినాల్సిన వయసులో ఉన్న ఓ బాలుడు... కన్నవారికి పట్టెడన్నం పెట్టేందుకు శ్రమిస్తున్నాడు.

తల్లిదండ్రుల తినిపిస్తే తినాల్సిన వయసులో ఉన్న ఓ బాలుడు... కన్నవారికి పట్టెడన్నం పెట్టేందుకు శ్రమిస్తున్నాడు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే బాధ్యతలు భుజాలపై వేసుకుని.... కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిత్తూరు జిల్లా గంగుడుపల్లికి చెందిన...అంధ దంపతులు పాపిరెడ్డి, రేవతికి ముగ్గురు పిల్లలు. వీరిలో ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు గోపాలకృష్ణారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చే ఫించనే కుటుంబానికి జీవనాధారం. రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చిన తర్వాత... ఈ-రిక్షాలో సరకులు విక్రయిస్తున్నాడు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు.

పాపిరెడ్డి కుటుంబం... గ్రామ శివారులోని రేకుల షెడ్డులో జీవనం సాగిస్తోంది. చుట్టుపక్కల పొలాల నుంచి పాములు వస్తూ ఉండటంతో భయంభయంగా గడుపుతున్నారు. కళ్లు లేని దంపతుల్ని... పిల్లలే అప్రమత్తం చేస్తున్నారు. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తల్లిదండ్రుల చేతి వెళ్లు పట్టుకుని నడవాల్సిన వయసులో... వారి చేయికే ఊతంగా మారుతున్నారు. చేయి పట్టుకుని నడిపిస్తూ... దారి చూపుతున్నారు. ఎనిమిదేళ్ల బాలుడు పడుతున్న శ్రమను చూసి... గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story