Vizianagaram: వయస్సు తక్కువైందంటూ పెన్షన్ ఇవ్వని అధికారులు.. అందుకే బంధువులు ఇలా..

Vizianagaram: వయస్సు తక్కువైందంటూ పెన్షన్ ఇవ్వని అధికారులు.. అందుకే బంధువులు ఇలా..
Vizianagaram: విజయనగరం కలెక్టరేట్‌లో హృదయ విధారకర సంఘటన చోటుచేసుకుంది.

Vizianagaram: విజయనగరం కలెక్టరేట్‌లో హృదయ విధారకర సంఘటన చోటుచేసుకుంది. నడవలేని స్థితిలో ఉన్న80 ఏళ్ల ఓ వృద్దురాలు... తనకు పెన్షన్ ఇప్పించాలంటూ మొరపెట్టుకుంది. ప్రాణం పోయేలా ఉంది. పెన్షన్ ఇవ్వండంటూ అధికారులకు మొరపెట్టుకుంది. తాళ్లపూడి పేటకు చెందిన సిరిపురం సీతమ్మ అనే పెద్దావిడకు వయస్సు తక్కువైందంటూ అధికారులు పది నెలలుగా పెన్షన్ నిలిపివేశారు. దీంతో ఆమె రెండుకాళ్లు, నడుము పనిచేయక నడవలేని స్థితిలో ఉండటంతో... బంధువులు సీతమ్మను మంచంపై కలెక్టరేట్‌కు మోసుకొచ్చారు. పెన్షన్ డబ్బులతోనే తనకు కాలం గడుస్తుందని.. తమకు పెన్షన్ ఇప్పించాలంటూ కన్నీటి పర్యంతం అయింది.

Tags

Next Story