Roja: నగరిలో రోజాకు వింత అనుభవం.. పెళ్లి చేయాలంటూ వృద్ధుడి విన్నపం..

X
By - Divya Reddy |17 May 2022 5:15 PM IST
Roja: గడప గడపకు కార్యక్రమంలో భాగంగా నగరిలో ప్రజల దగ్గరకు వెళ్లిన రోజాకు ఓ ముసలాయన అడిగిన మాటతో ఏం చెప్పాలో అర్థం కాలేదు.
Roja: ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజాకు వింత అనుభవం ఎదురైంది.. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా నగరిలో ప్రజల దగ్గరకు వెళ్లిన మంత్రి రోజాకు ఓ ముసలాయన అడిగిన మాటతో ఏం చెప్పాలో అర్థం కాలేదు.. నగరిలో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు.. అలాగే ఓ వృద్ధుడితో మాట్లాడారు.. పెన్షన్ వస్తుందా లేదా అని అడిగారు.. అయితే, తనకు నెలనెలా పెన్షన్ వస్తోందని తాను ఒంటరిగా ఉన్నాని.. పెళ్లి చెయ్యమ్మా అని రోజాను అడిగాడు ఆ వృద్ధుడు. ఆ మాటతో నవ్వుకున్న రోజా.. పెన్షన్ అయితే ఇవ్వగలం గానీ పెళ్లి ఎక్కడ్నుంచి చేస్తాం అంటూ సమాధానం ఇచ్చారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com