Anakapalli Highway : త్తురుతో తడుస్తున్న అనకాపల్లి హైవే

Anakapalli Highway : త్తురుతో తడుస్తున్న అనకాపల్లి హైవే
X

గడిచిన వారం రోజులుగా అనకాపల్లి జిల్లా హైవే NH.16 రోడ్డు ప్రమాదకరమైన యాక్సిడెంట్లతో రక్తసిక్తమైంది. ఏ క్షణాన ఎటువంటి ప్రమాదకరమైన యాక్సిడెంట్ వార్త వినాల్సి వస్తుందా అన్న భయం పోలీసులకు, వాహన చోదకులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. గత ఐదు రోజుల క్రితం జరిగిన లంకెలపాలెం రోడ్డు ప్రమాదంలో లారీ సృష్టించిన బీభత్సానికి స్పాట్లో ముగ్గురు చనిపోగా అనేకమంది క్షతగాత్రులుగా మారి ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో చికిత్స పొందుతున్న మరి కొంతమంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతులు సంఖ్య 8 వరకు చేరింది అందించిన. ఈ సంఘటన మరోకముందే కసింకోట హైవేపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన సంఘటనలో 12 మంది గాయాలు పాలయ్యారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే అదే కసింకోట హైవేపై పువ్వుల లోడుతో కడియం నుంచి వస్తున్న వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో మహిళ గాయాలయ్యాయి జరుగుతున్న సంఘటన లపై ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేయాలని యాక్సిడెంట్ కు జరుగుతున్న కారణాల్లో తెలుసుకొని వాటిని నివారించే ప్రయత్నం చేయాలని ప్రజా రాజకీయ ఐక్యవేదిక కన్వీనర్ కన్సెట్ సురేష్ బాబు, బాలు వంటి నాయకులు అనకాపల్లి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. లంకెలపాలెం జంక్షన్ వద్ద ఉన్న సిగ్నల్ వ్యవస్థ సరి చేయాలని వేగాన్ని నిరోధించే బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తరచూ జరుగుతున్న ప్రమాదాలపై అధ్యాయం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story