చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే ఆనం భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన హైదరాబాద్ నుండి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. బ్రేక్‌ఫాస్ట్ మీటీంగ్‌లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,బీదా రవిచంద్ర,అనగాని సత్యప్రసాద్‌లతోసమావేశం కానున్నారు. ఆ తరువాత నెల్లూరు టీడీపీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు ఆనం. ఇక అత్మకూరు నియోజక వర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.నెల్లూరు జిల్లాలోలోకేష్ పాదయాత్రకు స్వాగత ఏర్పాట్ల పై చర్చించనున్నట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి కూడా జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబుతో ఆనం భేటీ అయ్యారు. సమారు గంట పాటు వీరిమధ్య సమావేశం జరిగింది. ముఖ్యంగా నెల్లురు జిల్లాలోని రాజకీయాలపై చర్చ జరిగింది.అయితే లోకేష్ పాదయాత్ర నెల్లూరుకి వచ్చేసరికి ఆనం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒంగోలు మహనాడు సందర్భంగా లోకేష్‌తో ఆనం కుమార్తె కూడా సమావేశమైంది. మరోవైపు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com