మాజీ మంత్రి అనిల్‌ వ్యాఖ్యలకు ఆనం కౌంటర్‌

మాజీ మంత్రి అనిల్‌ వ్యాఖ్యలకు ఆనం కౌంటర్‌
మాజీ మంత్రి అనిల్‌ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

మాజీ మంత్రి అనిల్‌ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. నెల్లూరు నుంచి పోటీకి సిద్ధమని అనిల్‌ సవాల్‌కి ఆనం ప్రతిసవాల్‌ విసిరారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే నెల్లూరు నుంచి పోటీ చేస్తానన్నారు. నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గ బాధ్యతులు అప్పగించినా స్వీకరిస్తానని చెప్పారు. నెల్లూరు నుంచి గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేసిన ఆనం రాంనారాయణ రెడ్డి.. రాజకీయాల నుంచి విరమించాలి అనుకుంటే నెల్లూరు నుంచి పోటీ చేస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలు కలుషితం అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని నిప్పులు చెరిగారు. లోకేష్ పాదయాత్రను చూసి కొంతమంది భయపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారని ఆనం రాంనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story