ఆన్ లైన్ లో ఆనందయ్య మందు..!

ఆన్ లైన్ లో ఆనందయ్య మందు..!
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి కొరియర్ ద్వారా ఆనందయ్య మందును పంపిస్తారు.

నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఎవరూ మందు కోసం కృష్ణపట్నం వెళ్లనవసరం లేదు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికే వస్తుంది.

అందుకోసం వెబ్ సైట్ కూడా రెడీ చేసింది ప్రభుత్వం. ఆనందయ్య మందు కోసం సంప్రదించాల్సిన వెబ్ సైట్ www.childeal.in. ఇక పై మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావొద్దని అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి కొరియర్ ద్వారా ఆనందయ్య మందును పంపిస్తారు. పోర్టులోని సీవీఆర్ ఫౌండేణ్ లో మందు తయారీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి మందు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనుంది.

Tags

Read MoreRead Less
Next Story