ఏపీ సీఎంకు ఆనందయ్య లేఖ..

ఏపీ సీఎంకు ఆనందయ్య లేఖ..
X
తాను తయారు చేస్తున్న కరోనా మందు అందరికీ అందుబాటులో ఉండాలంటే మీ సహకారం ఎంతైనా అవసరం అంటూ ఆనందయ్య

కరోనా ఔషదం అందరికీ అందుబాటులో ఉండాలంటే మీ సహకారం ఎంతైనా అవసరం అంటూ ఆనందయ్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఎక్కువ మొత్తంలో మందు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా సహాయ సహకారాలు అందించాలని, ఔషధ తయారీకి సామాగ్రి సమకూర్చాలని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈరోజు నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండలంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఈ ఔషధాన్ని ఇంటింటికీ చేరవేస్తున్నారు. మందు కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కృష్ణపట్రం వచ్చేవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక్కడి పంచాయితీ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Tags

Next Story