యువతిని నమ్మించి మోసం చేసిన YSRCP నాయకుడు

Anantapur
యువతిని నమ్మించి మోసం చేసిన YSRCP నాయకుడు
ప్రేమ పేరుతొ యువతిని నమ్మించి మోసం చేసిన వైసీపీ నాయకుడు

వైసీపీ రాజ్యంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. మోసపోయాం మొర్రో కాపాడండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. మోసం చేసినవాళ్లు అధికారపార్టీ వైసీపీకి చెందిన వాళ్లైతే పోలీసులు ఆవైపుకు కూడా చూడటంలేదు. ఇది స్వతంత్ర్య భారతంలోని రాష్ట్రమా లేక నిర్భందరాష్ట్రమా అని ప్రజలు చిగురుటాకులా వణుకుతున్నారు.

అనంతపురం జిల్లాలో ఓ అమ్మాయిని లైంగికంగా వాడుకుని వదిలేసాడు ఓ వైసీపీ లీడర్. చేసేది లీడర్ షిప్ అని తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకున్నాడు. అతని మాయమాటలు నమ్మిన, ఆ అమ్మాయి తన సర్వస్వాన్ని కోల్పోయింది. అనంతపురానికి చెందిన వైసీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గత తొమ్మిదేళ్లుగా ఓ అమ్మాయిని శారీరకంగా వాడుకుని ఇప్పుడు తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి దాటవేస్తున్నాడు. ప్రవీన్ రెడ్డి మోసం చేస్తున్నాడని గ్రహించిన యువతి డయల్ 100 ద్వారా జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అయితే ప్రవీన్ రెడ్డి అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుడు కాబట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి మీనమేషాలు లెక్కించారు.ప్రవీన్ రెడ్డికి రాజకీయ అండదండలు ఉండటంతో బాధితురాలిని 10రోజుల పాటు పోలీస్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు ఉరవకొండ పోలీసులు. బాధితురాలు పట్టువిడవకుండా పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టడంతో తప్పనిసరై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి రాజకీయ ఒత్తిళ్లు రావడం మొదలయ్యాయి. దాంతో పాటే... రాజీ కావాలని పోలీసుల ద్వారా ఒత్తిళ్లు చేయిస్తున్నారు వైసీపీ నాయకులు. రాష్ట్రంలోని పరిస్థితి రోజురోజుకు దిగజారి తారా స్థాయికి చేరిందని ప్రజలు బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో మరెన్ని దారుణాలు చూడాలో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story