మితిమీరుతున్న వైసీపీ నేతలు.. దళితులే టార్గెట్‌

మితిమీరుతున్న వైసీపీ నేతలు.. దళితులే టార్గెట్‌
దళితులే టార్గెట్‌గా దాడులకు తెగబడంతో పాటు వారి భూములను సైతం లాక్కుంటున్నారు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. దళితులే టార్గెట్‌గా దాడులకు తెగబడంతో పాటు వారి భూములను సైతం లాక్కుంటున్నారు. ముదిగుబ్బ మండలం పరిధిలోని దళిత రైతు లక్ష్మన్నకు చెందిన సుమారు 5 ఎకరాల భూమిని కబ్జా చేశారు స్థానిక వైసీపీ నేతలు. ఇదేంటని అడిగినందుకు బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరువుతున్నాడు.

లక్ష్మన్న అనే దళిత రైతుకు గుంజేపల్లి సమీపంలో 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. నెల రోజుల క్రితం రహదారిలో భాగంగా 5 సెంట్ల భూమిని కూడా ఇచ్చేశాడు. ఈ భూమికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా పొందాడు. అయితే లక్ష్మన్న భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి.. రికార్డులు తారుమారు చేశారు. రైతుల భూమిలోని మామిడి చెట్లను తొలగించారు. ఇక అన్యాయంగా తమ భూమిని లాగేసుకున్నారని.. తమకు న్యాయం చేయాలని బాధితుడు వాపోతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story