టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

X
అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కాకినాడ సబ్ జైలుకు తరలించారు. రెండు నెలలక్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రామకృష్ణారెడ్డి ఈ హత్యచేయించారని రమాదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఇవాళ రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
అటు.. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలు అనపర్తిలో ఆందోళనకు దిగారు. బిక్కవోలు పోలీస్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టు చేశారని వారు ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
