27 Jan 2023 6:06 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / Andhra Pradesh :...

Andhra Pradesh : బాలయ్యకు తప్పిన ప్రమాదం

సత్యసాయి జిల్లా హిందూపురంలో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో అపశ్రుతి..

Andhra Pradesh : బాలయ్యకు తప్పిన ప్రమాదం
X


హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. సత్యసాయి జిల్లా హిందూపురంలో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. గురువారం సాయంత్రం హిందుపురంలో పర్యటిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసే క్రమంలో ఆయన నిల్చున్న వాహనం అనుకోకుండా ముందుకు కదిలింది. దీంతో బాలకృష్ణ ఒక్కసారిగా వెనక్కితూలి పడబోయారు. బాలకృష్ణ వెంట ఉన్న టీడీపీ నాయకులు భూమిరెడ్డి గోపాల్ రెడ్డి ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానుండటంతో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే ప్రజా యాత్రలు చేస్తున్నాయి.

లోకేష్ యువగళం...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పేరుతో యాత్ర మొదలు పెట్టారు. కుప్పంనుంచి యాత్ర మొదలు కానుంది. కుప్పం నియోజకవర్గంలో సుమారు 29 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కిలోమీటర్లు పాదయాత్ర జరుగనుందని టీడీపీ నాయకులు తెలిపారు. వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది.

Next Story