Andhra Pradesh : యువగళం షురూ..!

Andhra Pradesh : యువగళం షురూ..!
X
జై యువగళం అంటూ కదులుతున్న పార్టీ శ్రేణులు; కుప్పం నుంచి ప్రారంభమై.... 4వేల కిలోమీటర్లు సాగనున్న యాత్ర..


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కుప్పం నుంచి మొదలైన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కిలోమీటర్లు సాగనుంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు యాత్ర ఆరంభమైంది. కుప్పంలోని లక్ష్మీపురంలోని శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను మొదలు పెట్టారు లోకేష్.


రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. తేదేపా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కుప్పం చేరుకున్నారు. 'జై యువగళం' అంటూ పార్టీ శ్రేణులు కదులుతున్నారు. కుప్పంలోని అంబేడ్కర్ విగ్రహానికి కాసేపట్లో లోకేష్ నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు యువగళం బహిరంగ సభలో పాల్గొననున్నారు లోకేష్.

Tags

Next Story