Andhra Pradesh: చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కి వర్ల లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో యువగళం పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు హింసిస్తున్నారంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల నియమావళి పేరు చెప్పి పోలీసులు పాదయాత్రలో టీడీపీ జెండాలను, బ్యానర్లను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా స్థానిక నాయకులు చేస్తున్న ఏర్పాట్లపై పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలంలో టిడిపి బ్యానర్లు, ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారని రాణిగుంట, కొత్తూరు, తిమ్మసముద్రం, మట్టం, 4వ కండ్రిగ గ్రామాల్లోనూ ఫ్లెక్సీలను తొలగించారని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలతో, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయని పాదయాత్రలో ప్రదర్శిస్తున్న టిడిపి జెండాలు గానీ, ఫ్లెక్సీలు గానీ ఎన్నికల నియమావళికి వర్తించవన్నారు. ఈ నేపధ్యంలో పాదయాత్రలో టిడిపి బ్యానర్లు, జెండాలు తొలగించి అడ్డంకులు సృష్టించవద్దని పోలీసులను ఆదేశించాలని వర్ల రామయ్య రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com