Andhra Pradesh : చంద్రబాబు పర్యటనలో టెన్షన్

Andhra Pradesh : చంద్రబాబు పర్యటనలో టెన్షన్
తెలుగుదేశం సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా మూడో రోజు పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు అనపర్తి పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనపర్తి దేవీ చౌక్‌ సెంటర్‌లో చంద్రబాబు పర్యటనకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు...ఇవాళ అనుమతి లేదంటూ ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. తెలుగుదేశం సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రెండు రోజులుగా విజయవంతంగా పర్యటన కొనసాగిస్తున్న చంద్రబాబు.. ఈరోజు సామర్లకోట నుంచి బయలుదేరి అనపర్తిలో భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అనపర్తిలో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతులు లేవన్నారు. చంద్రబాబు సభ నిర్వహించే ప్రాంతం అత్యంత రద్దీ ప్రాంతామని, ఐదువేలకు మించి ప్రజలు పట్టే అవకాశం లేదంటూ సభకు అనుమతులు నిరాకరిస్తూ నోటీసులు జారీ చేశారు.

ఇక పోలీసుల ఆదేశాలపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు కార్యక్రమాలకు వస్తున్న స్పందన చూసి వైసీపీలో వణుకు మొదలైందన్నారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుందనగా..పర్మిషన్ రద్దు చేయడం హేయమైన చర్యగ అభివర్ణించారు. వైసీపీది పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామంటున్నారు.

Tags

Next Story