Andhra Pradesh : ఏపీలో అధికార పార్టీ విధ్వంస కాండ

Andhra Pradesh : ఏపీలో అధికార పార్టీ విధ్వంస కాండ
అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడినా..ప్రత్యక్షంగా కనిపిస్తున్నా..అసలు కేసులే పెట్టడం లేదు

ఏపీలో వింత పరిస్థితి నెలకొంది. విధ్వంస కాండ, అరాచకపర్వం..ఇంత కంటే పెద్ద పదాలు ఉంటే కూడా అవి సరిపోవనట్లు ఉంది వైసీపీ నేతల దాడులు. అయితే లా అండ్‌ ఆర్డర్‌ను కంట్రోల్‌లో పెట్టాల్సిన పోలీసులు అధికార పార్టీకి దాసోహం అంటూ కండువా కప్పుకోని వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నా లైట్‌ తీసుకుంటున్నారు..కళ్లముందే అరాచకాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు.. అదే ప్రతిపక్ష నేతలు కాలు కదిపినా.. నోరు మెదిపినా అక్రమ నిర్భంధం లేదంటే కేసులు పెట్టి అడ్డుకుంటున్నారు. డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

మరోవైపు అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడినా..ప్రత్యక్షంగా కనిపిస్తున్నా..అసలు కేసులే పెట్టడం లేదు.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే బెయిల్‌కు వీలయ్యే తేలికపాటి సెక్షన్ల కింద కేసులు పెట్టి ఏదో మమ అనిపిస్తున్నారు. అరెస్టులు చేసే ఉద్దేశం కూడా ఉన్నట్లు ఉండదు. బాధితులకు మాత్రం, ఆ అరాచకాన్ని ప్రతిఘటించినా, నిరసనకు చేసినా వెంటనే వారిపై ఎక్కడా లేని విధంగా పెద్ద పెద్ద సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తున్నారు.

ఏకంగా పోలీసులపైనే హత్యాప్రయత్నం చేశారని, మారణాయుధాలతో దాడి చేశారని,విధుల్లో ఉన్న పోలీసులను గాయపరిచారని, ఎస్సీ,ఎస్టీ అధికారులను కులం పేరుతో దూషించారని.. ఇలా ఒకటేమిటి ఎన్ని ఉంటే అన్నీ కేసులు పెట్టేసి.. కొంప మునిగి పోతుందన్నట్లు ఆగమేఘాలపై వారిని అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఛాన్స్‌ ఉంటే వారిపై థర్డ్‌ డిగ్రీ కూడా ప్రయోగించేస్తున్నారు. ఇండియా అంతా రాజ్యాంగం ప్రకారం ఐపీసీ చట్టం ఉంటే ఏపీలో మాత్రం పోలీసులు వైసీపీ చట్టాన్ని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ వైసీపీ నేతలకు ఓ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మరోవైపు అధికార పార్టీ నేతలు కర్రలు,రాళ్లతో విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్లు బాదారు. ఆఫీస్‌లో ఉన్న కార్లను పగలగొట్టారు. ఓ కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.అయితే ఈ అరాచక పర్వానికి పోలీసులే సాక్షిగా ఉండటమే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అనేందుకు అద్దం పడుతుంది. వైసీపీ నేతలను అన్నా.. అన్నా.. ప్లీజ్‌ అంటూ బ్రతిమిలాడుకోవడం చూస్తుంటే ఏపీ పోలీసులు ఎంత నిస్సహాయత పరిస్థితిల్లో ఉన్నారో అర్ధం అవుతుంది.

పోలీసుల కళ్ల ఎదుటే వైసీపీ నాయకులు దాడులు, విధ్వంసాలు, దహనాలు, దౌర్జన్యాలు,దారుణాలకు తెగబడుతుంటే ....ఉక్కుపాదంతో అణచేయాల్సింది పోయి.. వారిని బాబ్బాబు అంటూ బతిమాలుకుంటున్నారు. హింసాత్మక ఘటనలతో అరాచకం సృష్టిస్తుంటే తమకేమి పట్టనట్లు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తున్నారు. పైగా పోలీసులే ఫిర్యాదుదారులుగా మారి బాధితులపై తిరిగి కేసులు పెడుతున్నారు.

ఇక గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, కారుకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టిస్తే ఇప్పటివరకూ కేసే నమోదు చేయలేదు. దీనిపై నిరసన తెలిపేందుకు, ప్రతిఘటించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ సహా పలువురు పలువురు నేతలపై మాత్రం హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద రెండు కేసులు పెట్టారు.మరో నేత బోడె ప్రసాద్‌ సహా మరికొందరిపైనా కేసులు నమోదు చేశారు. దాడులకు పాల్పడినా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఒకే ఒక్క కేసు, దానిపై నిరసన తెలిపిన టీడీపీ నాయకులపై మాత్రం మూడు కేసులు పెట్టారంటే ఏపీలో పోలీసులు ఎలా పని చేస్తున్నారో అర్ధమవుతుంది.

ఇదే ఘటన కారు గత డిసెంబరు 25న గుడివాడలో టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరరావును చంపేస్తానని బెదిరించడమే కాకుండా, ఆ పార్టీ కార్యాలయం పైకి కత్తులు, కర్రలతో దూసుకెళ్లి, పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరిన వైసీపీ నేతలపై చిన్న కేసులు పెట్టారు..గతేడాది చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు టీడీపీపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో వైసీపీని వదిలేసి టీడీపీకి చెందిన 65 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు.

మాచర్ల లో గతేడాది డిసెంబరులో వైసీపీ నాయకులు సృష్టించిన బీభత్స కాండలో కూడా తిరిగి బ్రహ్మారెడ్డి సహా 24 మందిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు పెట్టారు.చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడేందుకు అప్పటి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ దూసుకెళ్లగా.. ఆయనపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. జోగి రమేష్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇలా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాధితులపై కేసులు బనాయించడం పోలీసులకు అలవాటుగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story