AP Assembly Speaker : శ్రీవారి సేవలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

AP Assembly Speaker : శ్రీవారి సేవలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
X

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విధంగా సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ… నష్టపోయిన రాష్ట్రం… ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి… రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే శక్తిని సీఎం చంద్రబాబుకు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కలసికట్టుగా అందరికీ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Tags

Next Story