AP DGP : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌పై బదిలీ వేటు!

AP DGP :  ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌పై బదిలీ వేటు!
AP DGP : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం.

AP DGP : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్నారు. ఆయన్నే ఇప్పుడు పోలీస్‌ బాస్‌గా చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్‌ బాధ్యతలు కూడా రాజేంద్రనాథ్‌రెడ్డి వద్దే ఉంటాయి. గౌతం సవాంగ్‌ను GADలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. 2023 జులై వరకూ గౌతం సవాంగ్‌కు సర్వీస్‌ ఉన్నా అర్థాంతరంగా ఆయన్ను DGPగా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

నిజానికి గౌతం సవాంగ్‌ తర్వాత DGP రేసులో సీనియర్‌గా ద్వారకా తిరుమల రావు ముందు ఉన్నారని చెప్పాలి. కానీ ఆయన్ను కాదని 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి గతంలో విజయవాడ, విశాఖ సీపీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ IGగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో DGPగా సేవలు అందించబోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story