AP Budget: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌

AP Budget: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌
చాణక్యుడి తరహాలో సీఎం జగన్ పాలిస్తున్నారని ప్రశంస

ఏపీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి.ఉదయం 11:03 నిమిషాలకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ లో కొత్త పథకాలు, అలాగే భారీ ప్రకటనలు ఉండవు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వైఎస్ఆర్ నిబద్ధత తమ ప్రభుత్వ పాలనలో ప్రతిఫలించిందని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు.

1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను గడప గడపకూ అందిస్తున్నామన్నారు. కుప్పం సహా అనేక కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. కుప్పం పోలీస్ సబ్ డివిజన్‌ను ఆరు పోలీస్ స్టేషన్లతో ఏర్పాటు చేశామని.. అందరినీ సమానంగా చూశామని చెప్పడానికి ఇదే నిదర్శనమని బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.


ఏడు భాగాలుగా ఏపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మంత్రి బుగ్గన తెలిపారు. అవి సుపరిపాలనాంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహరాణుల ఆంధ్ర, అన్నపూర్ణాంధ్ర, సంక్షేమాంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్రగా తెలిపారు.

ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ చేరవేస్తున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. పాలనను మరింత చేరువ చేసేందుకు మరిన్ని రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. కుప్పం అలాంటిదే ఉన్నారు. కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సబ్ డివిజన్లు కూడా ఏర్పాటుచేశామన్నారు. కుప్పంలోనూ ఇవి ఏర్పాటు చేశామన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, పర్యాటక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజా పనులను పూర్తిచేస్తున్నామన్నారు.

తమ ప్రభుత్వంలో 4వ తరగతి నుంచి పై తరగతుల వరకూ 34 లక్షల 30వేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని మంత్రి బుగ్గన తెలిపారు. ఏటా 47 లక్షల మంది పిల్లలకు స్కూల్ కిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మనబడి నాడు నేడు పథకంతో స్కూళ్లను మెరుగుపరిచామన్నారు. మొత్తం 99.81 శాతం స్కూళ్లలో మౌలిక సదుపాయాలు అందించగలిగినట్లు తెలిపారు. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. ఇది గత ప్రభుత్వం కంటే 4 రెట్లు ఎక్కువ అని తెలిపారు. 1000 స్కూళ్లలో CBSE తరహా విద్యా విధానం తెచ్చామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story