ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!

X
ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టు ముందు ఐఏఎస్ అధికారులు గిరిజాశంకర్, విజయ్‌కుమార్, గోపాలకృష్ణ ద్వివేది, మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి హాజరయ్యారు. స్కూళ్ల ఆవరణలో గ్రామ సచివాలయాలు,రైతు భరోసాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పేద విద్యార్ధులు చదువుకునే స్కూళ్లలోనే రాజకీయాలు ఎందుకని ప్రశ్నించింది. గతంలో ఆదేశాలున్నా అధికారులు పరిగణనలోకి... తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కరణగా హైకోర్టు పేర్కొంది. ఈ నెల 31న పూర్తి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
